సేవ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం అవగాహన సదస్సు.
మచిలీపట్నం:
వైద్య సంక్షేమం, వైద్య విధానాలు, వైద్య సేవల గురించి స్థానిక జిల్లా కోర్టు సెంటర్లో సాయిబాబా గుడి వద్ద గల సేవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రముఖ వైద్యులచే అవగాహన సదస్సును రాష్ట్ర గ్రామీణ వైద్య సంక్షేమ సంఘ అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రముఖ వైద్య నిపుణులచే గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని, రాష్ట్రస్థాయిలో 200 మందికి పైగా ఈ సదస్సుకు హాజరవడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ ఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ వేము, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వి యాదవ్, డాక్టర్ తూమాటి షణ్ముఖ, డాక్టర్ కిరణ్, డాక్టర్ జి రామకృష్ణ, డాక్టర్ జాన్ రిచర్డ్, డాక్టర్ విశ్వనాథ్ లు వైద్య విధానాలు సేవలు గురించి ఆచరించవలసిన నూతన ప్రణాళికలు గూర్చి సవివరంగా వివరించారు. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వైద్యం చేయడంలో గ్రామీణ వైద్యుల సేవలు కీలకం అన్నారు. దాదాపు 200 మంది గ్రామీణ వైద్యులకు ఈ అవగాహన సదస్సును సేవ్ హాస్పటల్లో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ ఆంజనేయులు తో పాటు రాష్ట్ర నాయకులు నందగోపాల్, డేవిడ్ రాజు, జి ఆర్ ఆర్ సందీప్ కుమార్, మల్లికార్జునుడు, దుర్గారావు, అర్జున్ రావు, రాజేష్, జవహర్ పీటర్, రత్తయ్య, వాసుదేవ మూర్తి, ఖాన్, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

