MachilipatnamLocal News
June 24, 2026
జిల్లా

జిల్లా పరిషత్ పలువురు ఉద్యోగులకు పదోన్నతులు

  • June 24, 2026
  • 0 min read
[addtoany]
జిల్లా పరిషత్ పలువురు ఉద్యోగులకు పదోన్నతులు

మచిలీపట్నం:

జిల్లా పరిషత్ పరిధిలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జె. అరుణ జిల్లా పరిషత్ కార్యాలయంలో పదోన్నతి ఉత్తర్వులను ఉద్యోగులకు అందజేశారు. జిల్లా పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా, నలుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఉద్యోగులకు చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, సీఈఓ డాక్టర్ జె. అరుణ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ పరిపాలనలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, పదోన్నతులతో వచ్చిన కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారు సూచించారు. పదోన్నతి ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా పరిషత్ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్ గారు, జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN