MachilipatnamLocal News
June 19, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం మెడికల్ కాలేజీ ఆస్పత్రి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

  • June 16, 2026
  • 0 min read
[addtoany]
మచిలీపట్నం మెడికల్ కాలేజీ ఆస్పత్రి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

మచిలీపట్నం:

మచిలీపట్నం మెడికల్ కాలేజీని రాష్ట్రంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిటీపట్నం మెడికల్ కాలేజీ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని, సభ్యులు బోయిన రాజు, లింగం విజయ్, భూపతి త్రిపుర, ఎండీ భాషతో ప్రమాణం చేయించారు.

ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు కూడా మెరుగు పడాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఆస్పత్రి సిబ్బంది ప్రజల కోసం పని చేయాలి. ఆస్పత్రికి మంచి పేరు వస్తే అది అందరి కృషితోనే సాధ్యం. తీర ప్రాంతంలో ఎక్కువ మంది కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్యలపై రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తాం. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలి. అశ్వినీ కుమార్ , గోవిందరావు లాంటి ఎంతో మంది ప్రముఖ వైద్యులు మచిలీపట్నం ఆస్పత్రిలో పని చేశారు. వారిని మరిపించేలా ఆస్పత్రి సిబ్బంది పని చేయాలి. కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేసి ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్ , ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు , ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ , కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN