MachilipatnamLocal News
June 12, 2026
జిల్లా

జిల్లాలో ఘనంగా ప్రారంభమైన పాఠశాలలు

  • June 12, 2026
  • 1 min read
[addtoany]
జిల్లాలో ఘనంగా ప్రారంభమైన పాఠశాలలు

మచిలీపట్నం:

పాఠశాలల పునఃప్రారంభ సందర్భంగా జిల్లావ్యాప్తంగా “మన బడి – మన పండుగ” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యూ వి సుబ్బారావు మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ హై స్కూల్ మరియు లేడీ యాంప్తిల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూలతో స్వాగతం పలికి, వారికి విద్యామిత్ర కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యాభ్యాసంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author

SSN