MachilipatnamLocal News
June 6, 2026
జిల్లా

సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి

  • June 5, 2026
  • 0 min read
[addtoany]
సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి

మచిలీపట్నం:

శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని గొల్లనపల్లి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీమతి లావణ్య వేణి “నెట్ జీరో హెల్తీ క్యాంపస్” కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని గొల్లనపల్లి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీమతి లావణ్య వేణి “నెట్ జీరో హెల్తీ క్యాంపస్” కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆమె వసతి గృహ ప్రాంగణంలో చేపడుతున్న పనులను పరిశీలించి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) సిబ్బంది, హార్ట్‌ఫుల్‌నెస్ బృంద సభ్యులతో కార్యక్రమ అమలుపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా లావణ్య వేణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఇతర విద్యాసంస్థలను పర్యావరణహిత ప్రాంగణాలుగా తీర్చిదిద్దేందుకు “నెట్ జీరో హెల్తీ క్యాంపస్” కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,047 విద్యాసంస్థలను ఈ కార్యక్రమం కింద గుర్తించగా, కృష్ణా జిల్లాలో 19 విద్యాసంస్థలు ఎంపికైనట్లు పేర్కొన్నారు. గొల్లనపల్లి వసతి గృహాన్ని ఆదర్శ నమూనాగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంటూ, “అనంత ఆరణ్య” (అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్) విధానంలో సుమారు 0.25 ఎకరాల విస్తీర్ణంలో 1,650కు పైగా మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. మొక్కల పెంపకం, సంరక్షణ మరియు పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి మొక్కల మనుగడను నిర్ధారించాలని ఆదేశించారు.

నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, కంపోస్టింగ్ యూనిట్ల స్థాపన, వర్షపు నీటి సంరక్షణ గుంతల నిర్మాణం, అనంత అరణ్య నమూనాలో అధిక సాంద్రతతో మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ చర్యల ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు పచ్చదనం పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డి జి ఎస్) సాధనకు దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పచ్చని మరియు పర్యావరణహిత విద్యా వాతావరణాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని లావణ్య వేణి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబు, పాఠశాల ప్రిన్సిపాల్ కె. జగదీశ్వరరావు, ఏఎస్‌డబ్ల్యూఓ, హెచ్‌డబ్ల్యూఓ, ఇతర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది మరియు హార్ట్‌ఫుల్‌నెస్ బృంద సభ్యులు పాల్గొన్నారు.

About Author

SSN