MachilipatnamLocal News
September 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

మహిళ మెడలోని బంగారు నాంతాడు అపహరణ కేసును ఛేదించిన గూడూరు పోలీసులు

  • June 4, 2026
  • 0 min read
మహిళ మెడలోని బంగారు నాంతాడు అపహరణ కేసును ఛేదించిన గూడూరు పోలీసులు

ఇద్దరు నిందితులు అరెస్ట్ – 11 గ్రాముల బంగారం స్వాధీనం

గూడూరు:

నిందితులకు రిమాండ్ గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామంలోని వాటర్ ప్లాంట్ సమీపంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు నంతాడును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన గూడూరు పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌లు మరియు ఇతర సమాచారాన్ని విశ్లేషించి నిందితుల ఆచూకీ కనుగొన్నారు.దర్యాప్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన దేవర నాగేశ్వర రావు, 30 సంవత్సరాలు, మొగల్తూరు గ్రామానికి చెందిన నెల్లూరు సాయి దుర్గా ప్రసాద్, 29 సంవత్సరాలు లను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి రెండు కేసులకు సంబంధించిన సుమారు 11 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితులను గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రజల ఆస్తులు మరియు మహిళల భద్రతకు భంగం కలిగించే నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన గూడూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

About Author

SSN