అంగరంగ వైభవంగా మహానాడు తొలి రోజు వేడుకలు
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు – మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో ఘనంగా నిర్వహణ
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పసుపు పండుగ వాతావరణం
11 క్లస్టర్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు – వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహణ
మచిలీపట్నం:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు–2026 తొలి రోజు వేడుకలు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అంగరంగ వైభవంగా, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని 11 క్లస్టర్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణుల సమక్షంలో వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఎక్కడ చూసినా పసుపు జెండాలు, పార్టీ నినాదాలు, కార్యకర్తల సందడి మధ్య మహానాడు వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. క్లస్టర్ వారీగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాల్లో కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తొలుత మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్‌పై పలు క్లస్టర్లలో పర్యటిస్తూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ప్రతి క్లస్టర్ వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో మమేకమై మహానాడు నిర్వహణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రాభివృద్ధి అంశాలపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతం కావాలంటే ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత సిద్ధాంతంతో స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాడే ఉద్యమ పార్టీ అని పేర్కొన్నారు. మహానాడు అనేది కేవలం పార్టీ సమావేశం మాత్రమే కాదని, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసే మహోత్సవమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకు దిశానిర్దేశం చేస్తూ పార్టీకి నూతన శక్తిని అందిస్తున్నారని కొనియాడారు. మహానాడు ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం, ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మచిలీపట్నం రూరల్ పరిధిలో లోకే గ్రాండ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్, రాధాదేవి కన్వెన్షన్ హాల్, శ్రీ బాల సరస్వతి కళ్యాణ మండపం, అలాగే మచిలీపట్నం టౌన్ పరిధిలో సువర్ణ కళ్యాణ మండపం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్, ఈశ్వర్ రెసిడెన్సీ, ఎస్‌ఎస్‌ఆర్ ప్రైమ్, శుభం కన్వెన్షన్, శ్రీ లలితా కన్వెన్షన్ హాల్, వై కన్వెన్షన్ హాల్‌లలో క్లస్టర్ ఇంచార్జ్‌ల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాల్లో ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మొటమర్రి బాబా ప్రసాద్, జిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్, జిల్లా అధికార ప్రతినిధి కోస్తా మురళీకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణికుమార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు సలీం, రూరల్ పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, చిత్తజల్లు నాగరాము, అన్నం ఆనంద్, దింటకుర్తి సుధాకర్ పాల్గొన్నారు.
అలాగే క్లస్టర్ ఇంచార్జ్‌లు పల్లపాటి సుబ్రహ్మణ్యం, వంకా వెంకటేశ్వరరావు, తలారి సోమశేఖర్, తలారి రాంబాబు, పుప్పాల ప్రసాద్, లంకె హరికృష్ణ, కాగిత గోపాల్‌రావు, వక్కపట్ల శ్రీనివాస్, వెంకన్న, రియాజ్ పాషా, అక్కుమహంతి రాజా నాగేశ్వరరావు, పిప్పళ్ల వెంకట కాంతారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడు తొలి రోజు వేడుకలను విజయవంతం చేశారు.

