MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

ప్లాస్టిక్ పై పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • May 16, 2026
  • 0 min read
[addtoany]
ప్లాస్టిక్ పై పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

జిల్లాలో ఎక్కడ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కనపడరాదని ఇందుకోసం ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఎక్కడ కనపడిన స్వాధీన పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 15వ తేదీ మూడవ శనివారం నిర్వహించబోయే స్వర్ణాంధ్ర కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుంచి పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలోఅందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వాడకం నిషేధించాలన్నారు . జిల్లాలో పట్టణాల్లో గాని, గ్రామీణ ప్రాంతాల్లో గాని ఎక్కడా కూడా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ అమ్మకాలు జరగరాదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టి గోదాముల్లో గాని, స్థానికంగా ఉండే డీలర్ల వద్ద గాని, మరి ఎక్కడైనా గాని ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, పళ్ళాలు ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కనిపించినా నిర్దాక్షిణ్యంగా స్వాధీనం చేసుకోవాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ డిపిఓ ఎం ధనలక్ష్మి మెప్మా పిడి సాయిబాబా డాక్టర్ యుగంధర్ డి సి హెచ్ ఎస్ డాక్టర్ శేషు కుమార్ మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు నజీర్ కొండయ్య సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గ ల వర్గాల మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు తదితర అధికారులు ప్రజారాధికారులు పాల్గొన్నారు.

About Author

SSN