జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు
మచిలీపట్నం :
శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని అమరావతి లోని సచివాలయం ఐదవ బ్లాక్ లోని 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున వివిధ అంశాలపై సమీక్షించారు. వారు ఈ ఆఫీస్ , దస్త్రాల పరిష్కారం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, డేటా లేక్, అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామం అన్నారు. ఇ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు సీఎం అభినందనలన్నారు. . పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను అభినందిస్తున్నానన్నారు. . ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు వేగం పెంచాలన్నారు. . గత మూడు నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి రెండు రోజులకు తగ్గిందనీ. ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయన్నారు. . స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫైళ్ల క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశంమన్నారు. సీఎస్, సెక్రటరీలు, హెచ్వోడీలు మొదలుకుని.. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలన్నారు. . మ్యానువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. . పాలనకు టెక్నాలజీ అనుసంధానించడంతోపాటు…మానవీయ కోణంలో ఆలోచించి పరిపాలన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. . 24 గంటల్లోపు ఇ-ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. . ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పని తీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉన్నామన్నారు.. . జిల్లాల్లో ఇ-ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించాలన్నారు. . జిల్లా స్థాయిలో, హెచ్ఓడీలు తప్పనిసరిగా ఇ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలన్నారు.. ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు… మరింత మెరుగైన పాలనకూ కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలనీ సూచించారు.
పీజీఆర్ఎస్ కోసం ప్రజా దర్బార్లు
“పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దామన్నారు. . సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతోందన్నారు. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్ విధానంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఏదైనా ఒక రోజు నిర్ణయించాలని, ఆ రోజు ఎలాంటి వీడియో కాన్ఫరెన్స్ లు కూడా లేకుండా ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రికి తెలిపారు
దీంతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్టే… ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలన్నారు. ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్ణయించామన్నారు.. సమస్యలు పరిష్కారమైతే బ్రాండ్ రావటంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరగటం ముఖ్యమన్నారు.. ప్రతీ నెలా ఒక నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలన్నారు. . సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్ గా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు . అన్ని వీడియో కాన్ఫరెన్సులను కూడా ఒకరోజుకు పరిమితం చేద్దామన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ చొరవతో క్రీడలు గంధాలయ సెస్సు నేరుగా జమ
అసంపూర్తి భవనాలకు నిధులు కేటాయింపు
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ క్రీడలు, గ్రంథాలయాల నిర్వహణకు సంబంధించి సెస్సు సరిగ్గా వారికి తిరిగి రావడం లేదని, దాంతో ఆ సంస్థల ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టంగా ఉందన్నారు. ఆ సెస్సును వారికి బదిలీ అయ్యేలా వ్యవస్థ ఏర్పాటు అయితే సజావుగా అవి నడుస్తాయన్నారు
దీనిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ చట్ట ప్రకారం వారికి సెస్సు వారికి ఆన్లైన్లో నేరుగా పంపించేలా తగిన ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక క్రీడలు శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కు సూచించారు
అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటించినప్పుడు చాలా చోట్ల ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి భవనాలు 60 నుంచి 90 శాతం ఖర్చుపెట్టి కూడా పూర్తిగాక అసంపూర్తిగా నిలబడిపోయి ఉన్నాయన్నారు. అటువంటి భవనాలకు సంబంధించి సేవలందించే వివిధ శాఖలు బయట అద్దె భవనాల్లో ఉంటున్నాయన్నారు. అటువంటి భవనాలకు తక్కువ డబ్బుతో ఎక్కువ మోతాదులో మౌలిక సదుపాయాలు కల్పించుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు స్థానిక ముడా నిధులతో కొంతమేరకు పనులు పూర్తి చేశామన్నారు. ఇంకా చాలా వరకు మిగిలి పోయి ఉన్నాయన్నారు. కొన్ని సి ఎస్ ఆర్ నిధులతో పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. కొంచెం డ్రైవ్ పెట్టి అటువంటి భవనాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు.
దీనిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ ఎక్కడికి అక్కడ సిఎస్ఆర్ తదితర నిధులతో మ్యాచింగ్ చేసుకుని భవనాలు పూర్తి చేయాలని అంటూ ప్రభుత్వం తరఫున కూడా నిధులు కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రణాళిక ప్రధాన కార్యదర్శి పియుష్ కుమార్కు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా అన్ని జిల్లా కలెక్టర్ల నుండి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
ఉద్యాన తోటల పెంపకంలో భాగంగా ముఖ్యమంత్రి చర్చించే సమయంలో కృష్ణాజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పుట్టగొడుగుల వ్యాపారం కోసం మిషన్ తీసుకుంటున్నారని వారికోసం బ్యాక్వర్డ్ లింకేజ్ ఫార్వర్డ్ లింకేజీ స్థలం కావాలంటే కొంత మార్కెట్ యార్డులో వెతుకుతున్నామని మంచి ధర పలుకుతుందని బై బ్యాక్ కూడా తీసుకుంటే బాగుంటుందని ఇందుకోసం లీజుకు మార్కెట్ యార్డులో స్థలం ఇచ్చేందుకు అనుమతి కావాలని కోరగా ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ అంగీకారం తెలిపారు.
జిల్లాలోని కలెక్టరేట్ విసి హాల్ నుండి డి పి టి ఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు,ఎం వి ఐ శ్రీనివాసరావు, జి జి హెచ్ ఉప పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు

