కప్పలదొడ్డి గ్రామంలో “బడి పిలుస్తోంది”లో పాల్గొన్న డిఈఓ
మచిలీపట్నం:
శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు “బడి పిలుస్తోంది” ప్రవేశ నమోదు కార్యక్రమంలో భాగంగా గుడూరు మండలం లోని కప్పలదొడ్డి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు మరియు విద్యార్థులకు లభించే వివిధ ప్రయోజనాలను వివరించారు. అనంతరం తల్లిదండ్రులతో సమావేశమై ప్రతి బాలబాలిక ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యను అభ్యసించేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులను ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ప్రవేశ నమోదు తల్లిదండ్రుల చేత చేయించారు.

అనంతరం కప్పలదొడ్డి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారుల హాజరు, మౌలిక సదుపాయాలు మరియు గవర్నమెంట్ స్కూల్స్ కు మ్యాపింగ్ అయిన విద్యార్థుల వివరాలు పరిశీలించారు. సదరు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి-1 బి ఎస్ సి శేఖర్ సింగ్, మండల విద్యాశాఖ అధికారి-2 పి సుబ్రహ్మణ్యం, ZPHS కప్పలదొడ్డి ప్రధానోపాధ్యాయులు సుధారాణి, ఉపాధ్యాయులు మరియు సి ఆర్ పి లు పాల్గొన్నారు.

