MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

నగరంలో భారతీయ జనతా పార్టీ విజయోత్సవం

  • May 4, 2026
  • 0 min read
నగరంలో భారతీయ జనతా పార్టీ విజయోత్సవం

మచిలీపట్నం:

భారతీయ జనతా పార్టీ ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో అఖండ విజయం సాధించడం పట్ల జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు ఇర్రింకి నాగ శ్రీనివాస్, పంతం గజేంద్ర లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించినందుకు సోమవారం రాత్రి కోనేరు సెంటర్లో భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకొని, బెంగాల్ లో దీదీ దుర్మార్గ రాక్షస పాలనను మట్టి కరిపించి బిజెపి కి ప్రజలు అఖండ విజయం అందించారన్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలలో జాతీయ భావనను కలిగించడం పట్ల, అభివృద్ధి, దేశ రక్షణ, సంక్షేమ పథకాల పై విశ్వాసంతో ప్రజలు అందించిన ఘన విజయం అని నాయకులు పేర్కొన్నారు.

అస్సాం లో 3 వ సారి గెలుపు తో హేట్రిక్ కొట్టిందని, పుదుచ్చేరి లో రెండవ సారి ఎన్ డి ఏ విజయం సాధించడం జరిగిందన్నారు. చెన్నైలో ఎన్ డి ఏ 3వ స్థానంలో, కేరళలో 3 సీట్లలో గెలిచామన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడి హిందువుల ఆగ్రహానికి బలయ్యాడు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో పరిజితుడైయ్యాడనిఈవిషయం అన్ని ప్రతి పక్ష పార్టీలు నాయకులు గ్రహించడం మంచిదన్నారు. ముందుగా విజయోత్సాహంతో కోనేరుసెంటర్ లో టపాసులు కాల్చి, అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, కార్యాలయ ఇన్చార్జి వెంకట రమణ, అయోధ్య రాము, వైవిఆర్ పాండురంగారావు వీరమల్లు అభినందన, వన్నెంరెడ్డి ప్రసన్న ,సలాది రామకృష్ణ,మండల అధ్యక్షులు మత్తి నీలకంటేశ్వర రావు, సాయి, విన్నకోట సుబ్బారావు, వెన్నాఫణి రాజ్, తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *