యానాదులు కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వితరణ
మచిలీపట్నం:
మచిలీపట్నం లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సోమవారం మచిలీపట్నం రైల్వే స్టేషన్ వద్ద గల యానాదులు కాలనీ(దేవుడి తోట )లో 40 వేల రూపాయలు ఖరీదు చేసి బట్టలను వితరణంగా అందజేశారు. ఈ కార్యక్రమం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎల్. ఎస్. ఎస్. వి. డి హనుమంతరావు చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్ధినేడి శ్రీకాంత్, లంకిశెట్టి దీప్తి తమ సంపాదనలో 40,000 తో తమ కుమార్తె ఆశ్రిత పేరు మీద నిరుపేదలైన యానాదులకు బట్టలు అందించడం వారి హృదయ వితరణను తెలియజేస్తుందని అన్నారు. మన సంపాదనలో కొంత శాతం సమాజంలో పేదవారికి అందించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమం మానవసేవే మాధవసేవ కు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసీక్యూటర్ అడపా మురళి, యువ న్యాయవాది లంకిశెట్టి సాయి ఫణి సంతోష్ పాల్గొన్నారు.

