మచిలీపట్నం :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 వ జన్మ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ మైనింగ్ ,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ పేదలకు వస్త్ర దానం చేశారు. మానవతా హృదయంతో నీలిమ చేసిన సేవల్ని పలువురు ప్రసంశించారు.
ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ ఎంతో దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ సారధ్యంలో అమరావతి రాజధానిగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ద బడుతోందని కొనియాడారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరపల్లి అనిత, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లంకి శెట్టి నీరజ, పలువురు టిడిపి మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు.