MachilipatnamLocal News
April 14, 2026
జిల్లా

రాజ్యాంగ పలాలు అందరికీ అందాలి …అదే కూటమి ప్రభుత్వ ధ్యేయం…

  • April 14, 2026
  • 1 min read
[addtoany]
రాజ్యాంగ పలాలు అందరికీ అందాలి …అదే కూటమి ప్రభుత్వ ధ్యేయం…
 మచిలీపట్నం :
 
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. బస్టాండ్ సెంటర్లో గల పార్టీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి కొల్లు రవీంద్ర పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనే అందరికీ స్వయంగా స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని అదే కూటమి ధ్యేయమని చెప్పారు. ఆ దిశగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 
 
  ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, రాష్ట్ర బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యం, మోటమర్రి బాబా ప్రసాద్ , జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, కుంచె నాని, డా’ హాసీమ్ బేగ్, లోగిశెట్టి స్వామి ,కోస్తా మురళి కృష్ణ, బత్తిన దాస్, p.v ఫణి కుమార్, వసంత కుమారి, గుమ్మడి విద్యా సాగర్ ,అన్నం హరిరామ కృష్ణ, లంకె శేషగిరి ,బొడ్డు నాగరాజు, జోగి గౌరీ శంకర్, కాసాని బాగ్యారావు, చిల్లిముంత ప్రవీణ్, బత్తిన హర్ష తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *