MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: పి ఆర్ టి యు ఉమ్మడి కృష్ణాజిల్లా

  • April 6, 2026
  • 0 min read
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: పి ఆర్ టి యు ఉమ్మడి కృష్ణాజిల్లా
మచిలీపట్నం :
 
పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఏ గిరి ప్రసాద్ రెడ్డి, పిలుపుమేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈనెల 21వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పిఆర్టియు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నవాబ్ జాని, పెద్దిబోయిన శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలా రాఘవరాజు, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు కోసూరి రాజశేఖర్ ఒక ప్రకటనలో కోరారు. 2018 జులై డి ఏ ఒక్కటే రిలీజ్ చేయడం జరిగిందని, 2019 జనవరి నుండి పెండింగ్ లో ఉన్న రావలసిన డిఎ ఎరియర్లు, 11వ పిఆర్సి ఎరియర్లు, 12వ పిఆర్సి ఏర్పాటు తదితర పనులన్నీ ప్రభుత్వం వేగవంతంగా చేపట్టాలని కోరారు. రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్ర పిఆర్టియు కార్యనిర్వాహక సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిట్టా కృష్ణయ్య, ఎ.యం. గిరి ప్రసాద్ లకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిటీ వేయాలని 30 శాతం ఇంటీరియమ్ రిలీఫ్ ప్రకటించాలని, కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు 25వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా చేపడుతున్నామన్నారు. 
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మర్రి ప్రభాకర్, బలుసుపాటి మల్లికార్జునరావులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *