MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఉగాది పండుగ అందరి జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలి…డా ధన్వంతరి ఆచార్య.

  • March 19, 2026
  • 0 min read
ఉగాది పండుగ అందరి జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలి…డా ధన్వంతరి ఆచార్య.
మచిలీపట్నం :
 
        కొత్త ఆశలు, కొత్త విజయాలు, సంతోషం, ఆరోగ్యం తో  శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ అందరి జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలి అని బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నాయకుడు, ప్రముఖ వైద్యులు డా బృందావనం ధన్వంతరి ఆచార్య అన్నారు. 
        బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గొడుగుపేట శంకరమఠంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా గురువారం బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి బ్రాహ్మణుల సమస్యలు తదితర విషయాలపై చర్చించి,ఎం. వి. సీతాపతి రావు గానామృతం, పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి, బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ (ఘనాపాటి) చే పంచాంగ శ్రవణం నిర్వహించి, బ్రాహ్మణ సేవా సంఘం వారిచే రూపొందించిన పంచాంగాలను ఆవిష్కరించి, వివిధ రంగాల్లో నిష్ణాతులైన బ్రాహ్మణ ప్రముఖులకు సన్మానం చేశారు. 
       ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నాయకుడు, ప్రముఖ వైద్యులు డా బృందావనం ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ వేద పండితులు వినిపించే పంచాంగ శ్రవణం, భవిష్యత్తును నిర్దేశించే రాశి ఫలాలు, షడ్రుచులు మేళవించిన ఉగాది పచ్చడితో మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలికే శుభాది తెలుగు ప్రజల సంవత్సరాది ఉగాది అన్నారు. మన జీవితంలో ఆనందాలు, బాధలు, అనుభవాలను సమానంగా స్వీకరించాలి అని తెలియచెప్పే పండుగే ఉగాది పర్వదినం అన్నారు. 
        మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ ల సహకారంతో ఖచ్చితంగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా అందే పథకాలను నిరుపేద బ్రాహ్మణులకు అందించటానికి సిద్ధంగా ఉన్నామని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ తెలిపారు.
       ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, మోపర్తి సుబ్రహ్మణ్యం, పి ఎస్ ఎస్ ఆర్ శర్మ, వడ్లమన్నాటి మారుతి దివాకర్, జమ్మలమడక సేతురామయ్య, అంబటిపూడి సుబ్రహ్మణ్యం, భవిష్య, కానుకొలను, ఫణి కిరణ్ శర్మ, పిడుగు కృష్ణయ్య, 
ముత్తేవి శ్రీరామచంద్రమూర్తి, రాళ్ల బండి రాజారాం, గుడ్లవల్లేటి మృత్యుంజయ రావు, గోర్తి సీతారామ శర్మ, జొన్నలగడ్డ మాధవి, గురజాడ రాజరాజేశ్వరి, ఎం. ఉమాదేవి, పి. గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *