కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), ప్రొఫెషనల్ కోర్సుల
(PG(MA/MCOM/MSC/MHR/MED/MPA)&MBA/MCA) – III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ ) ఫలితాలు కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రాంజీ, పరీక్షల నియంత్రణాధికారి డా.పి. వీర బ్రహ్మచారి బుధవారం విడుదల చేశారు.
సంబంధిత విద్యార్ధులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా
పరిశీలించుకోవచ్చని వారు సూచించారు. పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్ధులు ఏప్రిల్ 1వ తేదీ వరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పునఃమూల్యాంకనానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ (www.kru.ac.in) లో పొందుపరిచినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.పి. వీర బ్రహ్మచారి తెలిపారు.