MachilipatnamLocal News
September 5, 2026
ఫీచర్స్

మచిలీపట్నం కు చెందిన దీప్తి కి కెఎల్ యూనివర్సిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా 2025–26 అచీవర్స్ అవార్డు

  • March 7, 2026
  • 1 min read
మచిలీపట్నం కు చెందిన దీప్తి కి కెఎల్ యూనివర్సిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా 2025–26 అచీవర్స్ అవార్డు

మచిలీపట్నం, 7 మార్చి 2026, SSN:

      కెఎల్ యూనివర్సిటీ సహకారంతో బ్యాంక్ ఆఫ్ బరోడా అందించే ప్రతిష్టాత్మక 2025–26 అచీవర్స్ అవార్డును మచిలీపట్నం కు చెందిన దీప్తి అప్పికట్ల సొంతం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం గుంటూరులోని కెఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన సురభి ఇంటర్నేషనల్ కల్చరల్ ఫెస్ట్  కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేశారు.
      దీప్తి కేఎల్ యూనివర్సిటీలో బీటెక్(సిఎస్సి) ఫైనల్ ఇయర్  చదువుతుంది. దీప్తికి అవార్డుతో పాటు 31,000 రూపాయల నగదు బహుమతి లభించింది. తమ కుమార్తెకు యూనివర్సిటీ అవార్డు రావడం పట్ల తండ్రి అప్పికట్ల అశ్విని కుమార్, తల్లి నాగలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *