మచిలీపట్నం :
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని వైజెఆర్ డిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో యువతి ,యువకులు రక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఎ) కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య , మహిళా పోలీస్ స్టేషన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. రామేష్ బాబు, ఈగల్ టీం, సైబర్ క్రైమ్ శక్తి టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యువతను దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరాలు, యాంటీ డ్రగ్స్ అవగాహన, అక్రమ మానవ రవాణా (ఇమ్మోరల్ ట్రాఫికింగ్), యాంటీ ర్యాగింగ్, మహిళల హక్కులు, పోక్సో చట్టం గురించి వివరంగా అవగాహన కల్పించారు.
సైబర్ నేరాల నుండి ఎలా రక్షించుకోవాలి, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలు, ర్యాగింగ్ నేరమని దాని చట్టపరమైన పరిణామాలు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం అంశాలను వివరించారు. అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై కూడా సమాచారం అందించారు. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యువత చట్టాలపై అవగాహన పెంపొందించుకుని బాధ్యతాయుత పౌరులుగా మారాలని అధికారులు పిలుపునిచ్చారు.