MachilipatnamLocal News
September 5, 2026
కృష్ణా జిల్లా

మచిలీపట్నంలో భారీ చోరీ

  • February 25, 2026
  • 0 min read
మచిలీపట్నంలో భారీ చోరీ
 50 తులాలు బంగారం, 1,40,000 నగదు చోరీ
 
బంగారం అంచనా విలువ 70 లక్షలు 
 
మచిలీపట్నం :
 
       మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్కార్ తోటలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు తలుపులు పగల కొట్టి చోరీకి పాల్పడ్డారని స్థానికులు వాపోతున్నారు.
 
           సేకరించిన వివరాలు ప్రకారం గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న నిమ్మగడ్డ మార్గరేట్ బుధవారం ఉదయం తన నివాసానికి తాళాలు వేసుకొని పాఠశాలకు వెళ్ళింది. ఇంటిలో ఎవరు లేకపోవడంతో ఇంటి తలుపులు పగల కొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు.  రంజాన్ మాసం మధ్యాహ్నం నుంచి  ఉర్దూ పాఠశాలకు  సెలవు కావడంతో ఉపాధ్యాయురాలు ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో ఉపాధ్యాయురాలు ఇంట్లో చోరీ జరిగిందని  చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
         చిలకలపూడి పోలీసులు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు చేస్తున్నారు. చోరీ కాబడిన బంగారం విలువ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 50 తులాల బంగారం, 1,40,000 నగదు, చోరీ జరిగినట్లు బంధువులు తెలిపారు. చోరీ కాబడిన బంగారం నేటి మార్కెట్ విలువ దాదాపు 70 లక్షల పై మాటేనని స్థానికులు తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *