మచిలీపట్నం బీచ్ అభివృద్ధే లక్ష్యంగా మసులా బే పార్కు

మచిలీపట్నం :
మచిలీపట్నం మంగినపూడి బీచ్ అభివృద్ధే లక్ష్యంగా నూతనంగా మసులా బే పార్కు ఏర్పాటు జరిగింది. ఈ మేరకు 11 మందితో నూతన కమిటీ ఏర్పడగా తొలి సమావేశం మచిలీపట్నంలోనే డాక్టర్ పట్టాభి సీతారామయ్య భవనంలో మంగళవారం నిర్వహించారు.కమిటీకి నూతన అధ్యక్షులుగా నియమితులైన గొర్రెపాటి శ్రీనివాస్ చందు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీచ్ తోపాటు మచిలీపట్నం సర్వతో మఖాభివృద్ధి కోసం ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన 11 మందిని ఎంపిక చేసి కమిటీలో సభ్యులుగా నియమించుకోవడం జరిగిందన్నారు. వీరంతా స్వచ్ఛందంగా బీచ్ మరియు మచిలీపట్నం తో పాటు కృష్ణాజిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తారన్నారు.
తాను ఈ కమిటీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించడానికి అంగీకరించానన్నారు.అలాగే వైస్ ప్రెసిడెంట్ గా రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్, జనరల్ సెక్రెటరీగా నడుకుదిటి నిఖిత, ట్రెజరర్ గా గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు వ్యవహరిస్తారన్నారు. మిగిలిన సభ్యులు వీసీ మెంబర్లుగా కొనసాగుతారని చందు తెలిపారు.రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ పని చేస్తుందన్నారు.
బీచ్ లో ఎలాంటి అభివృద్ధి చేయొచ్చు తద్వారా మచిలీపట్నం అభివృద్ధికి అభి ఏ విధంగా దోహాద పడతాయనే అంశాలను పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే దీనిపై సమగ్ర అవగాహనతో ఉన్నామన్నారు. కమిటీ సభ్యులతో పాటు ప్రజల్ని భాగస్వాములు చేసి మచిలీపట్నం అభివృద్ధికి పాటుపడతామన్నారు. కమిటీలో నియమితులైన 11 మంది ని ఈ సందర్భంగా పరిచయం చేశారు. వీరంతా ఆయా రంగాల్లో నిష్ణాతులుగా పేరుందినవారిగా చందు పేర్కొన్నారు. మా అందరి లక్ష్యం మచిలీపట్నం అభివృద్ధి జరగాలని అలాగే బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందాలనే తలంపుతో ఉన్నామని కమిటీ సభ్యులంతా ముక్తకంఠంతో చెప్పారు.

