మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జిసిఎస్కే గారికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఈ నెల 3 వ తేదీ నుంచి 8 తేదీ వరకు 6 రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా చేరుకున్న మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం మారిషస్ దేశాధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాన్వాయిలో గుంటూరుకు బయలుదేరారు. వారు ఈ నెల 4 వ తేదీన గుంటూరులో జరగనున్న 3 వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో మారిషస్ హై కమిషన్ మొదటి కార్యదర్శి గీతాంజలి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఐ ఎస్ డబ్ల్యూ ఎస్ పి ఆరిఫ్ హఫీజ్, జిల్లా పోలీసు అధికారి వి. విద్యాసాగర్ నాయుడు, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, విమానాశ్రయం డైరెక్టరు ఎం.ఎల్.కె రెడ్డి, టర్మినల్ ఆపరేషన్ ఇన్చార్జ్ అధికారి అంకిత్ జైస్వాల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి ఎస్ విజయలక్ష్మి, ఉప పాస్పోర్ట్ అధికారి రామకృష్ణ, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, విమానాశ్రయం సి ఎస్ ఓ ధర్మేంద్ర, గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు, గన్నవరం తహసిల్దార్ శివయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.