MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

వినూత్న కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో కృష్ణా జిల్లా : జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ

  • December 31, 2025
  • 0 min read
[addtoany]
వినూత్న కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో కృష్ణా జిల్లా : జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
 
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్లో డిఆర్ ఓ కే చంద్రశేఖర రావుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించి 2026 నూతన సంవత్సరం పురస్కరించుకొని ముందస్తుగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
 
అనంతరం వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను విశదీకరించారు.
 
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 
 
ఈసారి ఎక్కువగా పాడి పరిశ్రమ అభివృద్ధికి  సెక్స్ సార్టెడ్ సెమెన్ తో కృత్రిమ గర్భధారణచేసి దాదాపు 7500 దాకా ఆడ పశువులు జన్మించేలా చేసి పాల ఉత్పత్తి పెంపుదలకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఒక్కొక్క ఇంజక్షన్ 300 రూపాయలు కాగా రైతులకు ప్రభుత్వం 150 రూపాయల రాయితీ ఇస్తున్నదని జిల్లాలో ప్రత్యేక చొరవతో విజయ డైరీ సహకారంతో మరో 100 రూపాయలు రాయితీ అందించడంతో కేవలం 50 రూపాయలకే పాడి రైతులకు లభించే అవకాశం కల్పించామన్నారు. జిల్లాలో 60,925 ఎకరాల్లో ఆక్వా జోన్ జరుగుతోందన్నారు.
 
ప్రభుత్వం చేపట్టిన 10 సూత్రాల్లో భాగంగా ఒకటైన డీప్టెక్ కార్యక్రమాన్ని నందివాడలో డిజిటల్ ట్రేసబులిటీ ప్రయోగాత్మకంగా చేపట్టామన్నారు. 
 
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ( పి ఎం ఎం.ఎస్ వై ) పథకం కింద 867 యూనిట్లను మంజూరు చేశామని వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 
జిల్లాలో ధాన్యం సేకరణ గత సంవత్సరం 3,66,998 మెట్రిక్ టన్నుల ధాన్యం కాగా ఈ సంవత్సరం దాదాపు అంతకంటే 1.80 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా అంటే 5,42, 609 మెట్రిక్ టన్నులను సేకరించడం జరిగిందన్నారు. మొదటిసారి జిల్లాచరిత్రలో ఎన్నడు లేనివిధంగా ధాన్యాన్ని సేకరించి రైల్వే వేగన్ల ద్వారా రవాణా చేశామన్నారు.
 
గత సంవత్సరం 29 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయగా ఈసారి మరింత పెంపొందించి 39,888 ఎకరాల్లో సాగు జరుగుతూ ఉందన్నారు. తద్వారా 4000 మంది రైతులు అదనంగా లబ్ధి పొందారన్నారు.
 
 154 మంది రైతులను ఎల్ బండ్ పద్ధతిలో కూరగాయలు పండ్లు సాగు చేశారన్నారు.
రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది రైతులను 
ప్రోత్సహించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో ఉపాధి హామీ పథకాన్ని సమ్మిళితం చేస్తున్నామన్నారు.
 
విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగే విధంగా 106 పాఠశాలల్లో తోటల పెంపక కార్యక్రమం చేపట్టామన్నారు.
 
జిల్లాలో వ్యాపార అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రయత్నించగా 312 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారని, అందులో ఇప్పటికే 179 మందికి ఆర్థిక సహాయం అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడ్డామని అందులో 154 యూనిట్లు ప్రారంభించడం సంతోష దాయకమన్నారు. 
 
ఇంకా ఎవరైనా ఆసక్తి కలవారు ఉంటే డిఆర్డిఏ వారిని గాని లేదా ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో వచ్చి కలవాలని వారికి చేతనైన ఆర్థిక సహాయం అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. 
 
 బ్యాంకు లింకేజీల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని 799 కోట్ల రూపాయల లక్ష్యానికి గాను 864 కోట్ల రూపాయల రుణాలు అందించి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 
 
 శ్రీనిధి పథకంలో కూడా జిల్లా లక్ష్యం 153 కోట్ల రూపాయలు కాగా 166 కోట్ల రూపాయలు చేసి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 
 
పంట కాలవల్లో వృధాగా పెరుగుతున్న గుర్రపుడెక్కతో చిన్నాపురంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 24 మందికి వినూత్నంగా వివిధ కళాకృతులను తయారు చేయుటలో శిక్షణను ఇచ్చామని, వారికి 28 వేల రూపాయల ఆదాయం లభించిందన్నారు. హయాళులు పేరుతో ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడులు భాగస్వామ్య సదస్సులో ప్రదర్శనకు ఉంచగా 10 లక్షల రూపాయల ఆర్డరు లభించిందన్నారు.
 
జిల్లాలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద 27 పీతల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
నూతన సంవత్సరం 2026 లో మరో 500 పీతల పెంపకం యూనిట్లను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
 
గత సంవత్సరం కొన్ని సమస్యల వలన మంజూరై కూడా 377 పరిశ్రమల యూనిట్లు నెలకొల్పలేదని ఆ సమస్యలన్నిటిని పరిష్కరించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని త్వరలో యూనిట్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. 
 
మౌలిక వసతుల కల్పనలో భాగంగా జిల్లాల్లో 455.84 కిలోమీటర్ల రహదారులను విజయవంతంగా నిర్మించామన్నారు.
 
గ్రామ పంచాయతీల పరిధిలో కొత్త విధానాలతో ఆదాయం పెంపుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా గన్నవరం పంచాయతీ పరిధిలో క్రికెట్ బాక్సు కుంభకోణం కాఫీ ఇతర ఆదాయ వనరులు పెంచుకునే విధంగా పంచాయతీలు బలోపేతం చేసే విధంగా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
 
 236 పంచాయతీల్లో ఇన్ లైన్ క్లోరినేషన్ చేపట్టామని ఆటోమేటిక్గా క్లోరినేషన్ పూర్తయ్య దిశగా పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 6 పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా గుర్తిస్తూ ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రం వచ్చిందన్నారు. జిల్లాలో 9 స్వచ్ఛ రధాలు ప్రారంభించి స్వచ్ఛత కార్యక్రమాలు పై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. 
కొత్తగా 3177 ఇళ్లకు అసెస్మెంట్ గుర్తించి డిమాండ్ ఇచ్చి పన్ను వసూలుకు చర్యలు తీసుకోగా అదనంగా ఆరు కోట్ల రూపాయల ఆదాయం లభించి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు
 
 17 మంది అనాధ పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చే విధంగా దత్తత కార్యక్రమం పూర్తి చేశామన్నారు ఇందులో ఇద్దరు ప్రవాస భారతీయులకు దత్తత చేశామన్నారు.ఇందుకోసం కృషి చేసిన మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులను అభినందిస్తున్నా నన్నారు.
 
రెవెన్యూ శాఖ ద్వారా 1196 మంది కుటుంబాలకు చెందిన 320 ఎకరాలను 22 ఏ జాబితా నుండి తొలగించి వారికి మేలు కలిగించామన్నారు 
జిల్లాలో సుమోటో కరెక్షన్లు వస్తే 655 దస్త్రాలను సరిచేసి పరిష్కరించడం జరిగిందన్నారు.
 
ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యం కింద మోంతా తుఫాను సందర్భంగా అధికార యంత్రాంగం అంతా చాలా అప్రమత్తంగా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు.
జిల్లాలో 238 పునరావాస సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని అందులో 23,744 కుటుంబాల వారికి ఆశ్రయం కల్పించామన్నారు. తుఫానుగు పడిపోయిన 1476 చెట్లను మరుసటి రోజు ఉదయానికి తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశామని, 777 విద్యుత్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగగా ఒక్క సబ్ స్టేషన్ మినహా మిగిలినవన్నీ 24 గంటల్లోగా పునరుద్ధరించామన్నారు.
ప్రజల సమస్యలు ఇబ్బందులు మాదిరిగానే ఉద్యోగులకు కూడా సంక్షేమం కూడా దృష్టిలో ఉంచుకొని 239 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, 140 కారుణ్య నియామకాలు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. 
 
 జిల్లాలో నీటి పన్ను 17.28 కోట్ల రూపాయలు వసూలు చేసి రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు
 
జిల్లాలో యోగాంధ్ర, సూపర్ జీఎస్టీ కార్యక్రమాలను చాలా విజయవంతంగా నిర్వహించామన్నారు.
 
 వచ్చే 15 రోజుల్లోగా కలెక్టరేట్లో అమృత కృష్ణ పేరుతో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
 
సూర్యాఘర్ పథకం అమలులో 5318 గృహాలకు సౌరఫలకాలను ఏర్పాటు చేసి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం హర్షనీయమన్నారు. 
 
అలాగే అన్ని వసతి గృహాల్లోనూ జిల్లా ఖనిజనిధుల నుండి మరమ్మతులు చేపట్టి పూర్తి చేశామని, అంటు  వ్యాధులు ప్రబలకుండా, మంచినీరు కలుషితం కాకుండా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రతి వసతి గృహానికి ఒక నోడల్ అధికారిని నియమించి మెరుగైన వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు
 
 జనవరి ఒకటో తేదీన కృష్ణ సంకల్పం పేరుతో జిల్లాలోని 42 బాలికల వసతి గృహాలకు అవసరమైన ఇన్సినీరేటర్లు సరఫరా చేసేందుకు, కింద కూర్చొని చదువుకునేందుకు విద్యార్థులకు అవసరమైన 534 చిన్న సైజు బల్లలను అందజేయనున్నామన్నారు. 
 
కాబోయే రోజుల్లో కూడా ఇలాగే అందరూ కలిసికట్టుగా జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నానన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *