కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ సిహెచ్ రాజా పర్యవేక్షణలో నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు పోలీసుల సూచనలు, నియమాలను పాటించాలని అందరికీ తెలిసేలా ఆటో ద్వారా పట్టణ ప్రజలకు మైక్ అనౌన్స్మెంట్ తో బుధవారం ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ నున్న రాజు మాట్లాడుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలు రాత్రి సమయంలో ప్రజలు ఇంటివద్దనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకోవాలని అనవసరంగా రోడ్లపైకి వచ్చి కేక్ కటింగ్లు,బాణాసంచా లాంటి కార్యక్రమాలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ లాంటి పనులు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల నియమాలను పాటించని ఎడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు.