MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

జాతీయ న్యాయ సేవా వారోత్సవాలు: దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్లో అవగాహన సదస్సు

  • November 10, 2026
  • 1 min read
జాతీయ న్యాయ సేవా వారోత్సవాలు: దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్లో అవగాహన సదస్సు

మచిలీపట్నం:

జాతీయ న్యాయ సేవా వారోత్సవాలను పురస్కరించుకుని మచిలీపట్నంలోని దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోగన క్రాంతి శ్రీ, పూల సాయికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు.

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ప్రజలకు మరియు విద్యార్థులకు లభించే ఉచిత న్యాయ సేవలు, పథకాల గురించి వివరించారు. ముఖ్యంగా చిన్న పిల్లల రక్షణ కోసం రూపొందించిన ‘పోక్సో’ (POCSO) చట్టం, దాని పరిధి మరియు విద్యార్థులు తమ హక్కులను, చట్టపరమైన రక్షణలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.

పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో చట్టాలపై ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని నిర్వాహకులు కోరారు.

About Author

SSN