గిలకలదిండి UPHC పరిధిలో నీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ విడుదల
మచిలీపట్నం:
మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణలో భాగంగా గిలకలదిండి UPHC పరిధిలోని ఉల్లింగీపాలెం సచివాలయ ప్రాంతంలో నీటి నిల్వల వద్ద ఆయిల్ బాల్స్ విడుదల చేశారు. DMHO డాక్టర్ దయాకర్, జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు రాఘవేంద్ర రావు, సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్లు బాబా రామ్మోహన్ రావు, శ్రీనివాసరావు మరియు ఆశా కార్యకర్తలు నాగలక్ష్మి, సరోజిని తదితరులు పాల్గొన్నారు.

