MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

మచిలీపట్నంలో రేపే భారీ జాబ్ మేళా: 400కు పైగా ఉద్యోగ అవకాశాలు!

  • November 9, 2026
  • 1 min read
మచిలీపట్నంలో రేపే భారీ జాబ్ మేళా: 400కు పైగా ఉద్యోగ అవకాశాలు!

మచిలీపట్నం:

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 10న (మంగళవారం) మచిలీపట్నంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ ఆధ్వర్యంలో దిమ్మల సెంటర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రోడ్ వద్ద ఉదయం 9:00 గంటల నుంచి ఈ మేళా ప్రారంభమవుతుంది.

ఈ జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, మెడ్‌ప్లస్, టాటా ఎలక్ట్రానిక్స్, వరుణ్ మోటార్స్, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్, డైకిన్, అడెక్కో ఇండియా వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండి, 10th, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన యువత ఈ ఇంటర్వ్యూలకు అర్హులని జిల్లా ఎంప్లాయ్‌మెంట్ & స్కిల్ అధికారి Y. సత్య బ్రహ్మం తెలిపారు.

మొత్తం 400కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారని, అర్హులైన అభ్యర్థులు ముందుగా [https://naipunyam.ap.gov.in](https://naipunyam.ap.gov.in) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, ఆధార్, పాన్ కార్డు, విద్యా అర్హతల జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని కోరారు. వివరాలకు 99664 89796, 96665 43412 నంబర్లను సంప్రదించవచ్చు.

About Author

SSN