MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం అత్రివరద దత్త క్షేత్రంలో ఘనంగా శ్రీ శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆగమన మహోత్సవాలు

  • November 7, 2026
  • 1 min read
మచిలీపట్నం అత్రివరద దత్త క్షేత్రంలో ఘనంగా శ్రీ శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆగమన మహోత్సవాలు

మచిలీపట్నం:

మచిలీపట్నంలోని అత్రివరద దత్త క్షేత్రంలో శ్రీ శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆగమనాన్ని పురస్కరించుకుని నవంబర్ 24 నుంచి 27 వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విశేష పూజలు వైభవంగా నిర్వహించనున్నట్లు క్షేత్ర నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమాల వివరాలు

 * నవంబర్ 24 (మంగళవారం): సాయంత్రం 6:00 గంటలకు స్వామీజీకి స్వాగత సభ, అనుగ్రహ భాషణం, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.

 * నవంబర్ 25 (బుధవారం): ఉదయం 9:00 గంటలకు శ్రీ అత్రి వరద దత్తస్వామి అవతార ఆవిర్భావం సందర్భంగా దత్తస్వామికి తైలాభిషేకం, శ్రీ చక్రార్చన, నవగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 6:00 గంటలకు బస్టాండ్ ఎదురుగా ఉన్న లేడీస్ క్లబ్ ఆవరణలో “లలితా పారాయణ” మరియు “కార్తీక దీపోత్సవం” నిర్వహిస్తారు.

 * నవంబర్ 26 (గురువారం): ఉదయం 9:00 గంటలకు శ్రీచక్రార్చన, స్వామీజీ అనుగ్రహ భాషణం, అన్నప్రసాద వితరణ. సాయంత్రం 5:00 గంటలకు లేడీస్ క్లబ్ ఆవరణలో “సంపూర్ణ భగవద్గీత పారాయణ” ఉంటుంది.

 * నవంబర్ 27 (శుక్రవారం): ఉదయం శ్రీ స్వామీజీ వారి పయనం జరుగుతుంది.

కార్తీక మాస విశేష పూజలు & సేవా రుసుములు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నవంబర్ 13న నాగుల చవితి సందర్భంగా ఉదయం 9:00 గంటలకు క్షీరాభిషేకం, నవంబర్ 16న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం, డిసెంబర్ 4న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, మరియు డిసెంబర్ 6న శివ కల్యాణ మహోత్సవం నిర్వహించబడును.

కల్యాణాలు లేదా సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొనే భక్తులు రూ. 1,500/-, పేరు గోత్రాలతో వ్రతాలు చేయించుకోవడానికి రూ. 200/-, మరియు నెల రోజులు పూజల కొరకు రూ. 500/- చెల్లించి రశీదు పొందవచ్చని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.

About Author

SSN