MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

కార్తీక మాసం: మచిలీపట్నం డిపో నుంచి ‘పంచారామ’ ప్రత్యేక బస్సులు

  • November 2, 2026
  • 1 min read
కార్తీక మాసం: మచిలీపట్నం డిపో నుంచి ‘పంచారామ’ ప్రత్యేక బస్సులు

మచిలీపట్నం:

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మచిలీపట్నం ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు నవంబర్ 14, 15, 21, 22, 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 4, 5 తేదీల్లో (ప్రతి శని, ఆదివారాల్లో) రాత్రి 11:30 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి, పంచారామ క్షేత్రాల దర్శనం అనంతరం తదుపరి రోజు రాత్రికి తిరిగి మచిలీపట్నం చేరుకుంటాయని వివరించారు.

 * ఛార్జీ: ఒక్కొక్కరికి రూ. 1,200/-

 * అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్: 8808807789

 * ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 9963284363, 7382800995

ఈ ప్రత్యేక ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కలదని, భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

About Author

SSN