MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

‘మురసు’ తుఫాన్ హెచ్చరికలు: విద్యుత్ శాఖ అలర్ట్.. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

  • November 2, 2026
  • 1 min read
‘మురసు’ తుఫాన్ హెచ్చరికలు: విద్యుత్ శాఖ అలర్ట్.. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

విజయవాడ:

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సేవల్లో అంతరాయం కలగకుండా ఏపీసీపీడీసీఎల్  కృష్ణ సర్కిల్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశించారు.

ఎక్కడైనా విద్యుత్ లైన్లకు అంతరాయం కలిగినా లేదా ప్రమాదాలు జరిగినా తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందించేందుకు కృష్ణా సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు

 * కృష్ణా సర్కిల్ కంట్రోల్ రూమ్: 6281709355

 * ఉయ్యూరు డివిజన్: 7382623231

 * మచిలీపట్నం డివిజన్: 9450817572

 * గుడివాడ డివిజన్: 9440817573

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుఫాన్ సమయంలో ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల తీవ్ర జాగ్రత్త వహించాలని సీఎండీ పి. పుల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని హెచ్చరించారు. విద్యుత్ అంతరాయాలు లేదా ప్రమాదాలు ఎదురైనప్పుడు వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు గానీ, సంబంధిత డివిజన్ కంట్రోల్ రూమ్ నంబర్లకు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

About Author

SSN