MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

అర్ధరాత్రి రోడ్డుపైకి జిల్లా కలెక్టర్: విద్యుత్ పునరుద్ధరణ పనులపై అసంతృప్తి, అధికారులపై ఆగ్రహం

  • October 30, 2026
  • 0 min read
అర్ధరాత్రి రోడ్డుపైకి జిల్లా కలెక్టర్: విద్యుత్ పునరుద్ధరణ పనులపై అసంతృప్తి, అధికారులపై ఆగ్రహం

మచిలీపట్నం:

అర్నాబ్ తుఫాను ప్రభావంతో మచిలీపట్నంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించారు.

గాంధీనగర్, ఇంగ్లీష్ పాలెం, బస్టాండ్ వెనుక గానుగ సెంటర్, చింత చెట్టు సెంటర్, కాలేఖాన్ పేట, బలరాముని పేట, కాసాని గూడెం, పాత హౌసింగ్ బోర్డు కాలనీల్లో కలెక్టర్ అర్ధరాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిబ్బందిని మరింత సమర్థవంతంగా వినియోగించి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి విద్యుత్ సరఫరాను త్వరగా సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్దేశించారు.

రంగంలోకి ఏపీసీపీడీసీఎల్ సీఎండీ:

మరోవైపు జిల్లాలో తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లాకు చేరుకున్నారు. గూడూరు వద్ద జిల్లా కలెక్టర్ డీకే బాలాజిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పురోగతి మరియు చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై విస్తృతంగా చర్చించారు.

About Author

SSN