MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘కృష్ణా యూనివర్సిటీ – SkillDzire’ ఒప్పందం

  • October 30, 2026
  • 1 min read
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘కృష్ణా యూనివర్సిటీ – SkillDzire’ ఒప్పందం

మచిలీపట్నం:

విద్యార్థులలో వృత్తిపరమైన  పరిజ్ఞానాన్ని పెంపొందించి, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసింది. విద్యార్థులకు వేసవి కాలంలో మరియు పూర్తి సెమిస్టర్ ఇంటర్న్‌షిప్‌లు, ఆన్‌లైన్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందించేందుకు ‘SkillDzire Technologies Private Limited’ సంస్థతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ సమక్షంలో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. ఉషా, SkillDzire Technologies డైరెక్టర్ ముప్పళ్ల శ్రీకాంత్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ శిక్షణా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌లు మరియు కోర్సుల ద్వారా తమ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author

SSN