డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్‌కు వీర్నాల ఫౌండేషన్ ఉదారత
మచిలీపట్నం:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్‌కు వీర్నాల ఫౌండేషన్ తన ఉదారతను చాటుకుంది. బ్లడ్ సెంటర్ నిర్వహణకు అవసరమైన సమాగ్రిని అందజేయడంతో పాటు, సొసైటీలో పాట్రన్ సభ్యత్వాన్ని స్వీకరించింది.
కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ డి.కే. బాలాజీ గారి సూచనల మేరకు, వీర్నాల ఫౌండేషన్ చైర్మన్ వీర్నాల బాలాజీ రూ. 2 లక్షల విలువైన పరికరాలను రెడ్ క్రాస్‌కు అందజేశారు. ఇందులో రెండు 2 టన్ ఎయిర్ కండిషనర్లు మరియు డెల్ కంపెనీ ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. వీటిని రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ భవిరి శంకర్ నాథ్‌కు శనివారం అధికారికంగా అప్పగించారు. దీనితో పాటు, వీర్నాల ఫౌండేషన్ రూ. 25,000 చెల్లించి రెడ్ క్రాస్ పాట్రన్ సభ్యత్వాన్ని తీసుకుంది.
రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ సేవా కార్యక్రమాలకు విశేష సహకారం అందించిన వీర్నాల ఫౌండేషన్ చైర్మన్ వీర్నాల బాలాజీ గారికి రెడ్ క్రాస్ కృష్ణా జిల్లా చైర్మన్ డాక్టర్ డి.ఆర్.కే. ప్రసాద్, సెక్రటరీ భవిరి శంకర్ నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వీర్నాల శ్రీనాథ్, తేజ, పవన్, బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హనుమంతయ్య, డిఎఫ్ఓ హరికృష్ణ, బ్లడ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

