కృష్ణా విశ్వవిద్యాలయం యూజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విశ్వవిద్యాలయ అధికారులు విడుదల చేశారు. గురువారం యూజీ 3, 5, 7వ సెమిస్టర్ల రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ వివరాలను అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి. వీరబ్రహ్మాచారి మాట్లాడుతూ… నవంబర్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆన్‌లైన్ ద్వారా సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ ద్వారా పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
రూ. 5,000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. డిసెంబర్ 14వ తేదీ నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, కళాశాలల యజమాన్యాలు ఇతర పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను పరిశీలించాలని ఒక ప్రకటనలో సూచించారు.

