MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

రాజులపాటి గంగరాజుకు ఘన నివాళి..

  • October 2, 2026
  • 0 min read
రాజులపాటి గంగరాజుకు ఘన నివాళి..

 బంధువులు, మిత్రులు,అభిమానులు కన్నీటి వీడ్కోలు 

పార్టీలకు అతీతంగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

మచిలీపట్నం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు కొనకళ్ల జగన్నాథరావు సోదరి అల్లుడు రాజులపాటి గంగరాజు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గంగరాజు గతంలో అందరితో కలివిడిగా ఉంటూ బీసీ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

గంగరాజు మృతి వార్త తెలుసుకున్న వెంటనే పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పారు.కొనకళ్ళ నారాయణ, కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి నిర్వహించారు.

గంగరాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని, డీఎంసీ చైర్మన్ బండి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, తదితరులు ఉన్నారు.

శుక్రవారం నిర్వహించిన అంతిమయాత్రలో కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగరాజుకు కన్నీటి వీడ్కోలు పలికారు. రాజులపాటి గంగరాజు కుమార్తె, అల్లుడు విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో బంధువులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర విచారం  తో తుది వీడ్కోలు పలికారు.

About Author

SSN