మచిలీపట్నంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు: నేతృత్వం వహించిన పి.వి. ఫణి కుమార్
మచిలీపట్నం:
దేశ ద్వితీయ ప్రధాని, భారతరత్న స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్ ఆధ్వర్యంలో పరాసుపేట త్రిపుర సుందరి ఫౌండేషన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరాసుపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆలపాటి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పి.వి. ఫణి కుమార్, ఆలపాటి రమేష్ మరియు ఇతర ప్రముఖులు శాస్త్రి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఫణి కుమార్ మాట్లాడుతూ… నిజాయితీ, నిరాడంబరతలకు నిలువెత్తు రూపం లాల్ బహదూర్ శాస్త్రి అని, ఆయన జీవితం మరియు ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో దేశ రక్షణలో సైనికుల, ఆహార భద్రతలో రైతుల పాత్ర విశిష్టమైనదని చాటిచెప్పిన మహానాయకుడిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నాయకులు మోపర్తి సుబ్రమణ్యం, వడ్లమన్నాటి మారుతి దివాకర్, పి.ఎస్.ఎస్.ఆర్. శర్మ, నిమ్మగడ్డ శ్రీధర్, జి.ఎస్.ఆర్. శర్మ, పిడుగు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

