అవిరుపూడిలో బి.ఇ.ఎల్ ఆధ్వర్యంలో ఘనంగా విజిలెన్స్ అవగాహన సదస్సు
అవిరుపూడి (మొవ్వ):
మొవ్వ మండలం అవిరుపూడి గ్రామంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), మచిలీపట్నం ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి.ఇ.ఎల్ మచిలీపట్నం విజిలెన్స్ ఆఫీసర్ కె. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, అవినీతి నిర్మూలన, పారదర్శకత మరియు నిజాయితీ యొక్క ప్రాముఖ్యతపై గ్రామస్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… సమాజంలో అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరూ నిజాయితీగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన, అవినీతి రహిత సమాజ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో బి.ఇ.ఎల్ అధికారులు రామకృష్ణ, గోపాల్ కృష్ణ, హనుమాన్ తో పాటు గ్రామ పంచాయతీ సభ్యులు, స్థానిక పెద్దలు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

