మచిలీపట్నం సబ్ జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం
మచిలీపట్నం:
స్థానిక స్పెషల్ సబ్ జైలులో అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కె వి ఎల్ హిమ బిందు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎండి రహీమతుల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా జైలు ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయమూర్తులు ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన ‘సత్యమేవ జయతే’ నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. హింసా మార్గాన్ని వీడి, అహింసా మార్గంలో మంచి పరివర్తనతో మెలగాలని ఖైదీలకు సూచించారు.
ఈ సందర్భంగా జైలులో ఖైదీలకు నిర్వహించిన చెస్, క్యారమ్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు సోగన క్రాంతి శ్రీ, టి సాయి శ్రీవత్సస్, ఎం భవ్య మణిమాల, సీనియర్ అడ్వకేట్ చీలి ముసలయ్య, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ జయశ్రీ, జైల్ సూపరింటెండెంట్ పిల్లా రమేష్, డిప్యూటీ జైలర్ T. మౌలి బాబు, జైలు సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

