గాంధీజీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనతో పాటు పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. గాంధీజీ 157వ జయంతి సందర్భంగా శుక్రవారం మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్స్టేషన్ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అహింస, సత్యం అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన మహానాయకుడు గాంధీజీ అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోందని, గ్రామ స్వరాజ్య సాధనకు కట్టుబడి ఉందని తెలిపారు. రెండేళ్ల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో ప్రారంభించిన చెత్త తొలగింపు కార్యక్రమం ప్రస్తుతం తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, AMC చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, గొర్రెపాటి గోపీచంద్, మోటమర్రి బాబా ప్రసాద్, పీవీ ఫణి కుమార్ తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

