MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కు కుర్చీల వితరణ

  • October 1, 2026
  • 1 min read
డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కు కుర్చీల వితరణ

మచిలీపట్నం:

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్’కు రూ. 20 వేల విలువచేసే ఐదు ప్రత్యేక కుర్చీలను వితరణగా అందజేశారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలలో రక్త సేకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ కుర్చీలను బహుకరించారు.

రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్, ఎస్.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాల అధినేత శిర్విశెట్టి భాస్కర్ ఈ విరాళాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతూ రక్త కేంద్రం అవసరాల నిమిత్తం ముందుకు వచ్చిన శిర్విశెట్టి భాస్కర్ ఉదారతను రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ డి.ఆర్.కే. ప్రసాద్, కార్యదర్శి శంకర్ నాథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN