MachilipatnamLocal News
September 25, 2026
జిల్లా

కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డీకే బాలాజి బాధ్యతల స్వీకరణ

  • September 25, 2026
  • 0 min read
కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డీకే బాలాజి బాధ్యతల స్వీకరణ

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా సమగ్ర అభివృద్ధిలో జిల్లా ప్రజా పరిషత్‌ది అత్యంత కీలకమైన పాత్ర అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్‌ ప్రత్యేక అధికారిగా ఆయన శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తన సతీమణి పృథ్వీ కళ్యాణి, తండ్రి కృష్ణయ్య శెట్టిలతో కలిసి హాజరయ్యారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ… రాజ్యాంగబద్ధమైన సంస్థగా ప్రజా పరిషత్‌కు ఉన్న బాధ్యతలను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. జెడ్పీ పరిధిలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, అందుబాటులో ఉన్న వనరులు, ప్రజలకు అందుతున్న సేవలను త్వరలోనే సమగ్రంగా సమీక్షిస్తామన్నారు.

స్థానిక పరిస్థితులు, ప్రజల ప్రాథమిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనమే పరమావధిగా ప్రజా పరిషత్ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కే. శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈవో డాక్టర్ జే. అరుణ, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్ తో పాటు జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN