తుఫాన్ ముప్పు: శుక్రవారం కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్
మచిలీపట్నం:
జిల్లాలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పాఠశాలలకు శుక్రవారం (సెప్టెంబర్ 25, 2026) లోకల్ హాలిడే (స్థానిక సెలవు) ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు ఇతర అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పాఠశాలలకు సెలవు అమలయ్యేలా ఉప-విద్యాశాఖాధికారులు (DyEOs), మండల విద్యాశాఖాధికారులు (MEOs) తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.

