MachilipatnamLocal News
September 20, 2026
పెడన

కోకా నారాయణపాలెంలో వైభవంగా వీర్నాల బాలాజీ జన్మదిన వేడుకలు

  • September 18, 2026
  • 0 min read
కోకా నారాయణపాలెంలో వైభవంగా వీర్నాల బాలాజీ జన్మదిన వేడుకలు

గూడూరు:

గూడూరు మండలం కోకా నారాయణపాలెం గ్రామంలో వీర్నాల ఫౌండేషన్ అధినేత వీర్నాల బాలాజీ జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, అభిమానులు మరియు గ్రామస్తుల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ సీతారామ దేవస్థానంలో బాలాజీ ప్రత్యేక పూజలు నిర్వహించి దైవాశీస్సులు అందుకున్నారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు.

పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. అలాగే గ్రామానికి చెందిన ఆడపడుచులకు నూతన చీరలను పంపిణీ చేయడంతో పాటు, ఈ నెల 13న నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న లబ్ధిదారులకు కళ్ళజోళ్లను అందజేశారు. వేడుకకు విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఫౌండేషన్ ప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author

SSN