మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి జన్మదిన వేడుకలు
మచిలీపట్నం:
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగవీటి రాధా రంగా మిత్రమండలి కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. మిత్రమండలి అధ్యక్షులు రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు (RSR) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి ఎంపీ బాలసౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఎంపీ వల్లభనేని బాలసౌరి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహరహం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో జనసేన నాయకులు, కూటమి సభ్యులు మాదివాడ రాము, కొట్టి వెంకటరావు, వాలిశెట్టి మల్లి, వాలిశెట్టి తిరుమల రావు, పంతం గజేంద్ర, వాలిశెట్టి రవి, గరికపాటి శివ, నాలి మాధవ, డాక్టర్ రాధిక, సాయిన శివయ్య, సుంకర శేఖర్, తూమాటి సురేష్, తోట భాస్కర్ రావులతో పాటు రాధా రంగా మిత్రమండలి కమిటీ సభ్యులు, ఎంపీ బాలసౌరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

