మచిలీపట్నంలో ఘనంగా ‘సేవా సంకల్ప అభియాన్’: రేపు నమో రక్తదాన శిబిరం, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
మచిలీపట్నం:
భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచానికే ఆదర్శవంతమైన మచ్చలేని మహానాయకుడిగా నిలిచారని కృష్ణాజిల్లా బీజేపీ నాయకులు కొనియాడారు. మచిలీపట్నంలోని కృష్ణాజిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ… ప్రధాని మోదీ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి అసమాన సేవలు అందించారని పేర్కొన్నారు.
మోదీ 76వ జన్మదినం మరియు విశ్వకర్మ జయంతి సందర్భంగా పార్టీ పిలుపు మేరకు ‘సేవా సంకల్ప అభియాన్’ పేరుతో రేపు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రేపు ఉదయం 11:00 గంటలకు స్థానిక మెహర్ బాబా ఆడిటోరియంలో బీజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో ‘నమో రక్తదాన శిబిరం’ మరియు విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 6:00 గంటలకు ఆస్విధార దీపం తో పాటు పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్రరావు, పుప్పాల రామాంజనేయులు (రాము), పామర్తి రామకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రింకి శ్రీనివాస్ నాయుడు, వేములపల్లి వెంకటరమణ, బొమ్మిడి నారాయణస్వామి, జి. విజయబాబు, బండారు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఈ సేవా కార్యక్రమాల్లో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

