శనివారం మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు విఘాతం
మచిలీపట్నం:
భాస్కరపురం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ రైల్వే స్టేషన్ విద్యుత్ ఫీడర్‌కు సంబంధించి అత్యవసర మరమ్మత్తులు, నిర్వహణ పనులు చేపడుతున్నట్లు ఏపీ సీపీడీసీఎల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ G. గోవింద రావు తెలిపారు. ఈ పనుల కారణంగా శనివారం (సెప్టెంబర్ 12, 2026) ఉదయం 8:00 గంటల నుండి ఉదయం 11:00 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యుత్ నిలిచిపోయే ప్రాంతాలు:
* రామానాయుడుపేట
* నోబెల్ కాలేజ్ ఎదురుగా ఉన్న రోడ్డు ప్రాంతం
* నోబెల్ కాలేజ్ మెయిన్ రోడ్ (ఎడమ మరియు కుడి వైపు ప్రాంతాలు)
* బచ్చుపేట హిందూ కాలేజ్ వెనుక భాగం
* బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ వీధి
* భాస్కరపురం షార్కీ స్కూల్ పరిసర ప్రాంతాలు
పనులు పూర్తయ్యే వరకు వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

