MachilipatnamLocal News
September 20, 2026
విద్య - ఉపాధి

కృష్ణా యూనివర్సిటీ వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

  • September 8, 2026
  • 1 min read
కృష్ణా యూనివర్సిటీ వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కోర్సుల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ కూన రాంజీ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి. వీర బ్రహ్మచారి మంగళవారం తెలిపారు.

విడుదలైన ఫలితాలు

బి.ఎడ్ & స్పెషల్ బి.ఎడ్ (BED & Spl.BED) – IV సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)

ఎల్.ఎల్.ఎం (LL.M) – II సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)

రీవాల్యుయేషన్‌కు అవకాశం

సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం ಅಧಿಕారిక వెబ్‌సైట్ (www.kru.ac.in) ద్వారా సరిచూసుకోవచ్చు. రీవాల్యుయేషన్ (పునఃమూల్యాంకనం)కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 21, 2026 నాటికి నిర్ణీత రుసుము చెల్లించి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

About Author

SSN