మచిలీపట్నంలో ఘనంగా వాసవి క్లబ్ వారోత్సవాలు: పలువురికి ఆత్మీయ సత్కారం
మచిలీపట్నం:
వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధా సూర్యప్రకాశ్ రావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ మాజేటి హరి ప్రసాద్ ఆదేశాల మేరకు క్లబ్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వారోత్సవాలు మచిలీపట్నంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ వారోత్సవాలలో భాగంగా స్థానిక శ్రీపాద ఫంక్షన్ హాల్ నందు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు రంగాల ప్రముఖులను ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వేముల కృష్ణ, కొత్తా రఘునాథ్, జల్లూరి రాంబాబు, వేముల శిరీషలతో పాటు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు కె. శ్రీదేవి, జూపూడి లత, జూపూడి శ్రీనాథ్‌లను దుశ్శాలువాలు కప్పి, జ్ఞాపికలతో సత్కరించారు. అలాగే క్లబ్‌కు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్న వాసవి గురువులు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ (సర్వీసెస్) యెండూరి సురేష్, శ్రీకాకోళపు రేణుక రాణిలను ప్రత్యేకంగా గౌరవించారు. క్లబ్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరం సమాజంలోకి తీసుకెళ్తున్న పత్రికా విలేకరులు అశోక్, ముదిగొండ శాస్త్రి, శర్మ, కోకా మహేష్‌లకు బహుమతులు అందజేసి దుశ్శాలువాలతో సన్మానించారు.
ఈ వేడుకలో వేముల నాగ వెంకట శిరీష, అన్నం అశోక్, తమ్మన అనురాధ, జల్లూరి దివ్య శ్రీ, తునుగుంట్ల రంగనాయకులు, వాసవి క్లబ్ అధ్యక్షుడు దేవత రాఘవేంద్రరావు, కార్యదర్శి జయవరపు ప్రసాద్, వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు రేకపల్లి పూర్ణ షామిలి, కార్యదర్శి అన్నవరపు సంగీత మరియు క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

