ఎస్‌సి నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణా కోర్సులు: కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం
మచిలీపట్నం:
కృష్ణా జిల్లాలోని చదువుకున్న ఎస్.సి (SC) నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వహక సంచాలకులు జె సత్యవతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల సహకార ఆర్థిక సంస్థ లీ., తాడేపల్లి వారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1న మచిలీపట్నంలోని కార్యాలయంలో దళిత సంఘాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ శిక్షణా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
అందుబాటులో ఉన్న శిక్షణా కోర్సులు & అర్హతలు
* గృహోపకరణాల వస్తువుల రిపేర్లు టెక్నీషియన్: 10వ తరగతి పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
* కిసాన్ డ్రోన్ ఆపరేటర్: ఇంటర్మీడియట్ పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 2 మాసములు)
* ఎలక్ట్రికల్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్: ఇంటర్మీడియట్ పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
* అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్: 10th / ITI పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
* మొబైల్ ఫోన్ హార్డ్ వేర్ రిపేర్ టెక్నీషియన్: 10th పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
* సోలార్ PV ఇన్‌స్టాలర్ (సూర్య మిత్ర): 10th / ITI / డిప్లొమా పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
* జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ (Israel): 10th పాస్ మరియు ANM, GNM, BSC Nursing (వయస్సు: 25-45, వ్యవధి: 3 మాసములు)
* ఫుట్ వేర్ స్టిచ్చింగ్ ఆపరేటర్: 9th పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
* సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్: ఇంటర్మీడియట్ పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
* రిటైల్ స్టోర్ ఆపరేటర్ అసిస్టెంట్: 8th పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 2 మాసములు)
* టెలికాం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ సెంటర్ / రిలేషన్ షిప్ సెంటర్: 10th పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
* ఫుడ్ & బెవరేజ్ సర్వీస్ అసిస్టెంట్: 10th పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 2 మాసములు)
* అసిస్టెంట్ టెక్నీషియన్ (కంఫ్యూటర్ & పెరిఫెరల్): 10th పాస్ (వయస్సు: 18-40, వ్యవధి: 3 మాసములు)
అప్లై చేసుకునే విధానం
ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు విద్యాఅర్హత పత్రములు, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ మరియు రైస్ కార్డ్ నకళ్లతో అధికారిక వెబ్‌సైట్ https://apsccorporation.ap.gov.in నందు నమోదు చేసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ సంస్థల ద్వారా స్వయం ఉపాధి పథకాలు పొందగోరు నిరుద్యోగులు కూడా తమ వ్యక్తిగత వివరాలను సదరు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9652057244 / 9848214161 నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు.

