MachilipatnamLocal News
April 29, 2026
మచిలీపట్నం

స్కౌట్స్ అండ్ గైడ్స్ మూడవ రోజున ‌శిక్షణ

  • April 27, 2026
  • 1 min read
[addtoany]
స్కౌట్స్ అండ్ గైడ్స్ మూడవ రోజున ‌శిక్షణ

మచిలీపట్నం:

 
స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ సెంటర్ చిలకలపూడి మచిలీపట్నం నందు ఈనెల 24నుండీ 28వరకు తృతీయ సోపాన్ గైడ్స్ శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. మూడవరోజున ‌శిక్షణలో భాగంగా ‘హైక్’ కు 
ఎల్వోసి రజియా బేగం ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న గైడ్స్ ని మంగినపూడి బీచ్ కి తీసుకువెళ్ళారు. 
ఓలేటి ఉమాసరస్వతి, రాజేశ్వరి, వీరకుమారి గైడ్ టీచర్ల పర్యవేక్షణలో ఉత్సాహంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు.అనంతరం కేరింతల మధ్య పోటాపోటీగా టగ్ ఆఫ్ వార్ ఆట ఆడారు. బీచ్ ఒడ్డున మార్చ్ ఫాస్ట్ చేయడం వలన పర్యాటకులు గైడ్స్ చెత్త శుభ్రం చేయుటను శ్రద్ధతో గమనించారు. ఇలా శుభ్రం చేయడంవలన పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల పరిసరాలలో చెత్త వేయకూడదని తెలుసుకున్నామని గైడ్ విద్యార్థినిలు అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సంచుల్లో నింపి మున్సిపాలిటీ వారు తీసికెళ్ళుటకు వీలుగా పల్లపు ప్రదేశంలో గుట్టగా వేశారు.
నివాసిత, పర్యాటక పరిసరాలలో చెత్త నియంత్రణకు పిల్లల్లో అవగాహన కల్పించే ప్రయత్నం అభినందనీయమని బీచ్ కు వచ్చిన పర్యాటకులు అన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *